Kalki 2898 AD : ‘కల్కి’ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.. మార్చి నుంచి..

ప్రభాస్ 'కల్కి' డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఇక మార్చి నుంచి..

Prabhas Kalki 2898 AD movie dubbing work star and promotions will start from march

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాలీవుడ్ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898AD’. మరో రెండు నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. శరవేగంగా పనులను పూర్తీ చేసుకుంటుంది. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడిస్తున్నట్లు సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. హాలీవుడ్ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యిపోయాయట. ఈ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ అయాజ్ పాష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కల్కి డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్లు ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ పిక్ తో కల్కి డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యిపోయాయి అని తెలుస్తుంది. ఇక మార్చి నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేయనున్నారట.

Also read : Celebrity Cricket Carnival : ఆస్ట్రేలియాలో క్రికెట్ విజేతలుగా నిలిచిన టాలీవుడ్ స్టార్స్.. నెక్స్ట్ CCL మ్యాచ్..

ఈక్రమంలోనే మార్చి 1న శివరాత్రి సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ మేకర్స్ సిద్ధం చేసి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ టీజర్ ని ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రం మొత్తం తొమ్మిది భాగాలుగా రాబోతుందని చెబుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు.

మే 9న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ధియేటరికల్ రైట్స్.. అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోతున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన రికార్డులను కల్కి మార్చుకుంటూ వెళ్తుందట. మరి రిలీజ్ తరువాత ఇంకెన్ని కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు