Kalki 2898 AD : బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి. ఆ ఫెస్ట్‌ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొనున్నారు. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్‌తో..

Kalki 2898 AD : బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Prabhas Kalki 2898 AD Movie posters in IIT Bombay TECH FEST

Kalki 2898 AD : బాహుబలి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్.. ఆ తరువాత కొన్ని ప్లాప్ లతో ఆడియన్స్ డార్లింగ్ క్రేజ్ తగ్గింది అనుకున్నారు అంతా. కానీ సలార్ సినిమాతో ఒక సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చి తన క్రేజ్ ని పాన్ ఇండియా లెవెల్ లో సుస్థిరం చేసుకున్నారు. సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ప్రస్తుతం అందరి దృష్టి ‘కల్కి’ పై పడింది.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్టుపోన్ అయ్యింది.

Also read : Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్..

ఇది ఇలా ఉంటే, ముంబై కాలేజీ ఫెస్ట్ లో కల్కి పోస్టర్స్ సందడి చేశాయి. బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్‌ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొనున్నారు. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. కల్కి గ్రాఫిక్ వర్క్స్ మరియు చిత్ర విషయాలు గురించి ఆయన మాట్లాడబోతున్నారు. ఇక ముంబై ఫెస్ట్ లో తెలుగు స్టార్ ప్రభాస్ పోస్టర్స్ కనిపించడంతో రెబల్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా సంబరపడుతున్నారు.

వైజయంతి బ్యానర్స్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. మరి కల్కి ఎన్ని భాగాలుగా వస్తుందో. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.