Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్..
ప్రభాస్, మారుతీ సినిమాని అధికారికంగా ప్రకటించినప్పటికీ షూటింగ్ ని మాత్రం జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసే టైం వచ్చింది.

Prabhas Maruthi Movie First look and title announce update
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ షూటింగ్ ని మాత్రం జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ సిద్దమయ్యారట.
రెబల్ అభిమానులకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా అప్డేట్ ని ఇవ్వబోతున్నారట. సినిమాని అఫీషియల్ గా ప్రకటిస్తూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఫస్ట్ లుక్ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. కాగా ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.
Also read : Vyooham : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్..
People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING ?
First Look and Title will be unveiled on Pongal ?#Prabhas #PrabhasPongalFeast ❤️?
A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z
— People Media Factory (@peoplemediafcy) December 29, 2023
మరి మూవీ టీం అదే టైటిల్ ని అనౌన్స్ చేస్తుందా లేదా మరో టైటిల్ ని ప్రకటిస్తుందా అనేది చూడాలి. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తో ఈ సినిమాలో మంచి కామెడీ పండించబోతున్నాడట మారుతి. ఇక ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది.
ఇది ఇలా ఉంటే, ఈ సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ప్రభాస్ ‘కల్కి’ సినిమా పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. ఆ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది ప్రశ్నగా మారింది. మరి ఆ విషయం పై కూడా సంక్రాంతికి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది చూడాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించనుండగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.