Vyooham : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్..

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ విడుదలకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్న కోర్టు..

Vyooham : వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్..

Highcourt gave stay on Ram Gopal Varma Vyooham movie release

Vyooham : టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చిత్రానికి మళ్ళీ అడ్డంకి ఎదురైంది. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే సినిమాని చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.నేడు ఈ సినిమా రిలీజ్ ఉండడంతో నిన్న తెలంగాణ హైకోర్టులో ఈ విషయం పై వాదనలు జరిగాయి. తాజాగా నేడు న్యాయస్థానం ఈ విషయం పై తీర్పుని వెల్లడించింది.

Also read : Vyooham : వివాదాల వ్యూహం.. ఆ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

ఈ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ లు వేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్న కోర్టు.. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలుపుదల చేస్తూ తీర్పుని ఇచ్చింది. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీలులేదని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 11కి వాయిదా వేసింది. దీంతో ఆర్జీవీకి మళ్ళీ చుక్క ఎదురైనట్లు అయ్యింది.

కాగా ఆర్జీవీ ఈ కథని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘వ్యూహం’గా ఆడియన్స్ ముందుకు వస్తుంటే, సెకండ్ పార్ట్ ‘శపథం’గా రాబోతుంది. శపథం సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు మొదటి భాగం రిలీజ్ అవ్వడానికే ఇబ్బందులు ఎదురవుతుంటే.. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడో అని సందేహం మొదలయింది.