Adipurush : ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.. వస్తున్నా రావణ అంటూ రాముడు యుద్ధం ప్రకటించేశాడు..
ప్రభాస్ ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. ఈ ఫైనల్ ట్రైలర్ లో..
- gum 95921
- Published On : June 6, 2023 / 09:31 PM IST
Prabhas Kriti Sanon Adipurush Final Trailer released
Adipurush Final Trailer : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం బ్యాక్‌డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలని మరింత పెంచేసింది. ఇప్పుడు మరింత హైప్ ని క్రియేట్ చేసేలా, అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నేడు (జూన్ 6) తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ ని ఫుల్ యాక్షన్ కట్ తో రెడీ చేశారు. ‘వస్తున్నా రావణ’ అంటూ రాముడు రావణుడి పై యుద్ధం ప్రకటిస్తూ ట్రైలర్ అదిరిపోయింది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు జరగని స్థాయిలో జరిగినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది.
Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?
కాగా గతంలో ప్రభాస్ బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అక్కడే జరుగుతుండడంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లక్షకు పైగా అభిమానులు పాల్గొన్నారు.
