Prabhas: ప్రభాస్ ‘డ్రీమ్ హౌస్’.. రెండు ఎకరాల్లో ‘అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్’.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

హైదరాబాద్ కోకాపేట లో ప్రభాస్ (Prabhas)విలాసవంతమైన తన డ్రీం హౌస్ ను నిర్మిస్తున్నారు.

Prabhas Luxurious Dream Home at Kokapet Hyderabad

    • ప్రభాస్ కోకాపేట లగ్జరీ డ్రీమ్ హౌస్
    • శరవేగంగా సాగుతున్న పనులు
    • హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ఇల్లు ఇదే

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజువల్ వండర్‌తో అంతర్జాతీయ స్థాయిలో మెప్పించిన ఆయన, ప్రస్తుతం మరిన్ని క్రేజీ చిత్రాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియా అయిన కోకాపేటలో తన సరికొత్త డ్రీం హౌస్ నిర్మాణ పనులను ప్రభాస్ ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు.

Bandla Ganesh Interview: డబ్బు లేదని చెప్పుతో కొడతావా.. ఇండస్ట్రీ పెద్ద మనిషి గురించి బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

కోకాపేట ఓఆర్ఆర్ (ORR) సమీపంలోని తన రెండు ఎకరాల భారీ స్థలంలో అన్ని రకాల గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన ఒక ‘అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్’ను ప్రభాస్ ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ ప్యాలెస్‌లో అత్యాధునిక జిమ్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు, ఆయన సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ఒక ల్యావిష్ లాంజ్ కూడా ఉండనుంది. షూటింగ్స్ లేని సమయంలో ప్రశాంతంగా గడపడానికి, ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ గా ఆతిథ్యం ఇచ్చేందుకు వీలుగా ఈ ప్రైవేట్ ప్రాపర్టీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ మ్యాన్షన్ ఖరీదు రూ.200 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇదే హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ఇల్లుగా కూడా చెప్పుకుంటున్నారు.

ఒకవైపు కొత్తింటి పనులు చూసుకుంటూనే, ప్రభాస్(Prabhas) తన లైనప్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగాతో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ చిత్రాలను లైన్‌లో పెట్టారు. లగ్జరీ హౌస్ నిర్మాణంతో పాటు ఈ భారీ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెబల్ స్టార్ పక్కా ప్లానింగ్‌తో ముందుకుసాగుతున్నారు.