Prabhas : ఫృధ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్.. సలార్ 2లో ప్రభాస్ డైలాగ్స్..

ఫృధ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నారా..? అలాగే సలార్ 2లో ప్రభాస్ డైలాగ్స్..

Prabhas movie in salaar fame Prithviraj Sukumaran direction

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కల్కి, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, కన్నప్ప గెస్ట్ రోల్.. ఇలా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి అయితే.. ప్రభాస్ తో సినిమా చేయడం కోసం మరికొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో తానే దర్శకుడిగా ప్రభాస్ తో ఓ సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.

సలార్ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్టులో స్నేహితులుగా కనిపించిన ఈ ఇద్దరు హీరోలు.. సెకండ్ పార్టులో శత్రువులుగా పోరాడబోతున్నారు. దీంతో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్ లో ఉన్నారు.

Also read : Ram Charan : RC17 అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.. బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడానికి మరోసారి..

ఇక ఈ ప్రమోషన్స్ లోనే పృథ్వీరాజ్ తెలుగు మీడియాకి కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ ని డైరెక్ట్ చేయడం, సలార్ 2లో ప్రభాస్ డైలాగ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. సలార్ మొదటి భాగంలో ప్రభాస్ చాలా తక్కువ డైలాగ్స్ చెప్పారు. దీంతో సెకండ్ పార్టులో కూడా అలాగే ఉంటుందా అనే సందేహం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ విషయం గురించి పృథ్వీరాజ్ ని ప్రశ్నించగా.. “రెండో భాగంలో ప్రభాస్ కి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయని” పేర్కొన్నారు.

కాగా పృథ్వీరాజ్ మంచి యాక్టర్ మాత్రమే కాదు, దర్శకుడు అని కూడా తెలిసిన విషయమే. లూసిఫర్, బ్రో డాడీ వంటి హిట్ సినిమాలను రూపొందించారు. తెలుగులో డైరెక్ట్ చేసే అవకాశం వస్తే, ఎవరితో చేస్తారు అని ప్రశ్నించగా.. ప్రభాస్ తన మొదటి ఆప్షన్ అని, దర్శకుడిగా ప్రభాస్ తో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అలాగే నటుడిగా కూడా తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు