Prabhas- Prasanth varma: వెనక్కి వెళ్లిన ‘బ్రహ్మరాక్షస’.. ప్రభాస్- ప్రశాంత్ మూవీ క్యాన్సిల్.. అసలు ఎం జరిగింది?
ప్రభాస్-ప్రశాంత్ వర్మ(Prabhas- Prasanth varma:) బ్రహ్మరాక్షస సినిమా క్యాన్సిల్ అయ్యింది.
- V Santhosh Kumar
- Published On : February 19, 2026 / 06:03 PM IST
Prabhas-Prasanth Varma Brahmarakshas movie cancelled
Prabhas- Prasanth varma: హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. లిమిటెడ్ బడ్జెట్ తో ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ చేసి చూపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prabhas- Prasanth varma) క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.
చాలా మంది మేకర్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే పలు సినిమాలకు అడ్వాన్స్ లు కూడా తీసుకున్నాడు. ఒకటికి మించి ప్రాజెక్టులను ఒకే చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ వివాదం కూడా చాలా కాలం నడిచింది. ఆ సమయంలో ఒప్పుకున్న సినిమాలు ఇప్పుడు ఉన్నాయా క్యాన్సిల్ అయ్యాయా అనేది కూడా ఎవరికి తెలియదు.
Aura Of Ustaad: ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమో వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ స్వాగ్ నెక్స్ట్ లెవల్
వాటిలో రెండు సినిమాలు మాత్రం సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి జై హనుమాన్ కాగా, మరొకటి మహాకాళి. ఇదిలా ఉంటే, జై హనుమాన్ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో భ్రహ్మరాక్షస అనే సినిమా చేయాల్సి ఉంది. మైథాలజీ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రకటన తోనే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది.
దానికి కారణం, ప్రశాంత్ వర్మ లైనప్. ఆయన ప్రస్తుతం చేస్తున్న జై హనుమాన్ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అని కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ఏడాదైనా పడుతుంది. ఆ సినిమా తరువాత మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది ప్రశాంత్ వర్మ. అందుకే, సమయం ఎక్కువ పడుతున్న కారణంగా ప్రభాస్ సినిమాను క్యాన్సిల్ చేశారట మేకర్స్. ప్రభాస్ హీరోగా వేరే దర్శకుడితో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది అని టాక్.
