×
Ad

Salaar Interview : సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్.. రాజమౌళితో సలార్ యూనిట్..

రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

  • Published On : December 17, 2023 / 06:44 PM IST

Prabhas Prashanth Neel Prithviraj Sukumaran Salaar Team Special Interview with Rajamouli

Salaar Interview Promo : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సలార్ సినిమాకి అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కానీ కేవలం రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Also Read : Salaar : సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సూర్యుడే గొడుగు పట్టి..

ఇటీవల ఆ ఇంటర్వ్యూ నుంచి ఓ ఫోటో బయటకి రాగా తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు. దీంతో ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఇది దొరకడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది. ఇక ఫుల్ ఇంటర్వ్యూ కూడా త్వరగా రిలీజ్ చేయాలని కోరుతున్నారు అభిమానులు. ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 19న రిలీజ్ కానుంది.