Prabhas: క్రేజ్ కా బాప్ ప్రభాస్.. వరుసగా నాలుగవ సారి టాప్ పొజిషన్.. ఇది కదా రికార్డ్ అంటే!
ఆర్మాక్స్ మీడియా సంస్థ మోస్ట్ పాపులర్ ఇండియన్ మెల్ స్టార్స్ లిస్ట్‌లో ప్రభాస్(Prabhas) టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 22, 2026 / 07:50 AM IST
Prabhas ranks top at Ormax Media Male Stars list for fourth consecutive time
- ఆర్మాక్స్ లిస్ట్‌లో ప్రభాస్ నెంబర్ 1.
- టాప్ 10 లో టాలీవుడ్ హవా.
- ప్రభాస్ రేంజ్ చూసి ఫ్యాన్స్ ఖుషీ.
Prabhas: బాహుబలి సినిమాలో వీడు ఎక్కడున్నా రాజేరా.. అనే డైలాగ్ గుర్తుందా? కేవలం సినిమాలోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఆ డైలాగ్ కేవలం రెబల్ స్టార్ ప్రభాస్‌కే పక్కాగా సెట్ అవుతుంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తున్న మన డార్లింగ్, పాపులారిటీలోనూ తనే ‘కింగ్’ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ మెల్ స్టార్స్ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నారు.
ఇది ఏదో ఒకసారి వచ్చిన క్రేజ్ కాదు.. గత నాలుగేళ్లుగా ప్రభాస్(Prabhas) ఈ చార్ట్‌లో నెంబర్ 1 స్థానాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో నెక్స్ట్ లెవెల్ హైప్‌లో ఉన్న డార్లింగ్, ఈ ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచారు. ఆర్మాక్స్ సర్వేలో ప్రభాస్ రేంజ్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. రాజంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈసారి టాప్ 10 లిస్ట్‌లో టాలీవుడ్ హీరోల హవా గట్టిగా నడిచింది. ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా, పుష్ప 2క్రేజ్‌తో అల్లు అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 5వ స్థానంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 7వ స్థానంలో నిలిచారు. ఇక ఎన్టీఆర్ టాప్ 10లో నిలిచి టాలీవుడ్ పవర్‌ను చాటారు. టాప్ 10లో ఐదు స్థానాలు మన హీరోలవే కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినా దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
