×
Ad

Prabhas : బాహుబలి తరువాత ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్స్ చూశారా..? ఫ్యాన్ ఎడిట్స్‌ని మెప్పించలేక..!

బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా..? భారీ బడ్జెట్స్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న మేకర్స్.. ఫ్యాన్ ఎడిట్స్ ని కూడా మెప్పించలేకపోతున్నారు.

  • Published On : July 19, 2023 / 08:39 PM IST

Prabhas Sahoo Adipurush Project K Salaar first look pics

Prabhas : బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ప్రభాస్ నుంచి ఏ మూవీ వస్తున్నా దాని నుంచి ఆడియన్స్ భారీతనం ఆశిస్తున్నారు. కానీ ప్రభాస్ తో సినిమాలు తీసే మేకర్స్ మాత్రం.. కేవలం ప్రభాస్ ఇమేజ్ ని అడ్డం పెట్టుకొని సరైన కథ, క్వాలిటీ లేకుండా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో ప్రభాస్ ఇమేజ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మూవీస్ భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ.. లాంగ్ రన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేక ఇబ్బందులు పడుతున్నాయి.

Bro Movie : సినిమాకి బ్రో అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా..? అమెరికాలో ఈ మూవీ కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదా..?

 Sahoo first look 

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహూ’ (Sahoo). ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మేకింగ్, ప్రొడక్షన్ అండ్ ప్రభాస్ లుక్స్ పరంగా ఈ మూవీ సాహూ అనిపించుకున్నప్పటికీ కథ పరంగా మెప్పించలేకపోయింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో కథ మాత్రమే కాదు.. ప్రభాస్ లుక్స్, గ్రాఫిక్స్ అంటూ చాలా విషయాలు ఆడియన్స్ కి చిరాకు తెప్పించాయి.

Radhe Shyam first look 

Samuthirakani : తెలుగుతో పాటు 12 భాషల్లో బ్రో సినిమా రీమేక్.. సాయిధరమ్‌తో సముద్రఖని మరో మూవీ..

Adipurush first look

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ (Adipurush) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలోని ప్రభాస్ లుక్ మాత్రమే కాదు ప్రతి విషయంలో మూవీ టీం చాలా అశ్రద్ధ వహించింది. దీంతో విమర్శలు, వివాదాలు ఎదురుకోవాల్సి వచ్చింది. వీటి తరువాత ప్రభాస్ నుంచి రిలీజ్ కి సిద్దమవుతున్న సినిమాలు సలార్ (Salaar), ప్రాజెక్ట్ K (Project K). సలార్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి.

 Salaar first look 

Leo : లియో మూవీతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. భారీ ధరకి తెలుగు రైట్స్‌ కొనుగోలు..!

అయితే తాజాగా ప్రాజెక్ట్ K నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని విపరీతంగా నిరాశ పరిచింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ తెరకెక్కుతుండడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ లాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్స్ కంటే ఫాన్స్ చేస్తున్న ఎడిట్స్ బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, అప్డేట్స్ ఇవ్వడంలో కూడా ప్రభాస్ మూవీ మేకర్స్ చేస్తున్న పనులు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది.

Project K first look pics