×
Ad

Skanda : ‘సలార్’ తప్పుకోగానే ‘స్కంద’ కూడా వచ్చేశాడు.. రామ్ స్కంద కొత్త రిలీజ్ డేట్ ఇదే..

ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో చిన్న, మీడియం సినిమాలు ఆ డేట్ కి క్యూ కట్టాయి.

  • Published On : September 6, 2023 / 10:16 AM IST

Prabhas Salaar Postponed Ram Boyapati Skanda Movie new Release Date

Skanda Movie : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) కాంబినేషన్లో సినిమా స్కంద సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) ఓ పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో రామ్ ఎప్పుడూ లేనంతగా ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నామని గతంలోనే ప్రకటించారు. అయితే ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో చిన్న, మీడియం సినిమాలు ఆ డేట్ కి క్యూ కట్టాయి. సెప్టెంబర్ 28 మిలాద్ ఉన్ నబి, 29, 30 సాధారణ వీకెండ్ అవ్వగా, అక్టోబర్ 1 ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడేస్ వచ్చాయి. ఇలా నాలుగు రోజులు సెలవులు రావడంతో దొరికిందే ఛాన్స్ అనుకోని సలార్ వాయిదా పడగానే ఇప్పటికే రూల్స్ రంజన్, మ్యాడ్, పెదకాపు అనే చిన్న సినిమాలు ఆ డేట్ ని ప్రకటించాయి. ఇప్పుడు రామ్ స్కంద సినిమా డేట్ కూడా మార్చేసి కొత్త డేట్ ని ప్రకటించారు.

Anushka : టిఫిన్ చేస్తూనే లంచ్ గురించి మాట్లాడతారు.. ప్రభాస్‌తో తింటే ఫుడీస్ కూడా.. ప్రభాస్ ఫుడ్ పై అనుష్క కామెంట్స్..

స్కంద సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు చిత్రయూనిట్.