Prabhas: మిర్చి బైక్ తో డార్లింగ్ ప్రభాస్.. ‘బైకర్’ సినిమా కోసం స్పెషల్ వీడియో
శర్వానంద్ బైకర్ సినిమా ప్రమోషన్స్ కోసం స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్(Prabhas).
prabhas special video for biker movie promotions
- బైకర్ ప్రమోషన్స్ లో ప్రభాస్
- మిర్చి బైక్ తో స్పెషల్ వీడియో
- శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్
Prabhas: టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం అయ్యింది. భారతదేశంలోనే తొలి మోటోక్రాస్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో మెరవనుండటం విశేషం. సినిమా విడుదలకు సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Sriya Reddy: నటి శ్రీయ రెడ్డి రీ-యూనియన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.
ముఖ్యంగా ఈ చిత్ర ప్రమోషన్లలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనదైన స్టైలిష్ లుక్‌లో బైక్‌పై వచ్చి, ట్రైలర్ లోని డైలాగ్‌ను ఉద్దేశించి “కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్” అంటూ చెప్పిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ప్రభాస్ నుంచి ఇలా సపోర్ట్ రావడం చూసి హీరో శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు. “థ్యాంక్యూ ప్రభాస్(Prabhas) అన్న.. నీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాపై ఉండటం నా అదృష్టం, మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియా వేదికగా తన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ చేసిన ఈ చిన్న వీడియోతో బైకర్ సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ‘బైకర్’ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. శర్వానంద్ కెరీర్లో ఇదొక విభిన్నమైన ప్రయత్నంగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా యువతను, మాస్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Thank you, Prabhas Anna. Love you 🫂
You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉
Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7
— Sharwanand (@ImSharwanand) March 31, 2026
