మూడు భాగాలుగా తెరకెక్కబోయే రామాయణలో రాముడుగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకొనే, రావణ బ్రహ్మగా రెబల్ స్టార్ ప్రభాస్..
భారత రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెర మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయన మధు మంతెన, నమిత్ మల్హోత్రలతో కలిసి.. మూడు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. నితేష్ తివారి (‘దంగల్’ ఫేమ్), రవి ఉడయార్ (‘మామ్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ–ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేసే వాళ్ల లిస్ట్‌లో.. రాముడిగా హృతిక్ రోషన్, సీత క్యారెక్టర్‌లో దీపికా పదుకొనే నటిస్తారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రావణ బ్రహ్మ పాత్రను రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తే బావుంటుందనేది మేకర్స్ ఆలోచన అని ముంబై సమాచారం.
Read Also : బాలయ్యతో లైలా – వైరల్ అవుతున్న పిక్..
రావణుడి పాత్రకు ప్రభాస్ ఫిజిక్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని, ఆల్రెడీ ‘బాహుబలి’ లాంటి పీరియాడిక్ సినిమా చేసి ఉండటం, ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అప్పీల్ ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ప్రభాసే పర్‌ఫెక్ట్ అని టీమ్ ఆలోచిస్తుందట.. మరి ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఓకే అంటాడా.. లేదా చూడాలి మరి..