రాధే శ్యామ్ : ప్రభాస్, జయరాం పిక్ వైరల్
- sekhar
- Published On : November 27, 2020 / 09:03 PM IST
Prabhas with Jayaram: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, UV Creations, TSeries సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కృష్ణంరాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జయరాం కీలకపాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు.
