Prabuthwa Junior Kalashala : సినిమా కోసం.. ఆర్టిస్టులందర్నీ పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ భాష నేర్పించాం..

తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Prabuthwa Junior Kalashala : సినిమా కోసం.. ఆర్టిస్టులందర్నీ పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ భాష నేర్పించాం..

Prabuthwa Junior Kalashala Punganuru Movie Pre Release Event Highlights

Prabuthwa Junior Kalashala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. ఈ సినిమా జూన్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మా జీవితాల్లో అది ఒక బిగ్ డే. ఎన్నో ఇబ్బందులు దాటి మా సినిమాను రిలీజ్ వరకు తీసుకొచ్చాము. క్వాలిటీలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టీజర్, ట్రైలర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు నెలల టైమ్ తీసుకున్నాం. భాష పర్ఫెక్ట్ గా ఉండటానికి ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసం ఆల్మోస్ట్ 8 నెలలు కష్టపడ్డాం. మా ఊరి పేరును టైటిల్ లో పెట్టి మా ఊరిలోనే సినిమా తీశాను. చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు చూశాను. ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమా కావొచ్చు కానీ క్వాలిటీ పరంగా మాత్రం కాదు. ఈ సినిమా చూసాక మీ పేరెంట్స్ ని గుర్తుకు తెచ్చుకుంటారు అని అన్నారు.

Also Read : Kalki Promotions : ప్రమోషన్స్ ఎక్కడ బ్రో.. కల్కి సినిమాపై ప్రమోషన్స్ చేయట్లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్..

నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేవు. శ్రీనాథ్ గారిని ఓ సారి కలిసినప్పుడు సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అర్థమయి ఇలా ఈ సినిమాకు నిర్మాతగా మారాను. చాలా పెద్ద సినిమాలు చేయాల్సినంత ప్రతిభ, కమిట్మెంట్, ప్యాషన్ శ్రీనాథ్ లో ఉన్నాయి. మేము ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లోనే ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమాని చక్కగా రూపొందించాడు అని తెలిపారు.

హీరోయిన్ షాజ్ఞ మాట్లాడుతూ.. ఇదే నా మొదటి సినిమా. మా డైరెక్టర్ నాతో మంచి పర్ఫార్మెన్స్ చేయించారు. ప్రణవ్ మంచి కోస్టార్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిపి తీసిన సినిమా ఇది అని తెలుపుతుంది.

హీరో ప్రణవ్ ప్రీతం మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరి లైఫ్ లో స్పెషల్. సిటీలో పెరిగిన మాకు పుంగనూరు లాంటి అందమైన ఊరిలో షూటింగ్ చేయడం చాలా బాగుండేది. నేను హీరో అవ్వాలనుకోలేదు. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసి నటుడిగా ట్రై చేస్తున్న సమయంలో డైరెక్టర్ శ్రీనాథ్ గారు నాకు లైఫ్ ఇచ్చారు అని తెలిపాడు.

Prabuthwa Junior Kalashala Punganuru Movie Pre Release Event Highlights