Chandra Sekhar Yeleti: ఐదేళ్ల తరువాత సినిమా.. వైవిధ్యమైన దర్శకుడితో ‘డ్యూడ్’ స్టార్.. ఊహించని కాంబో సెట్
లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్(Chandra Sekhar Yeleti).
- V Santhosh Kumar
- Updated on- April 1, 2026 / 06:50 AM IST
pradeep ranganathan doing his next movie with director chandrasekhar yeleti
- చంద్రశేఖర్ యేలేటితో ప్రదీప్ రంగనాథన్ మూవీ
- చాలా కాలం తర్వాత మూవీ చేస్తున్న డైరెక్టర్
- మైత్రి మూవీ మేకర్స్‌తో యేలేటి మ్యాజిక్
Chandra Sekhar Yeleti: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి(Chandra Sekhar Yeleti) ఒకరు. రొటీన్ ఫార్ములా కథలకు భిన్నంగా, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ వంటి చిత్రాలతో ఆయన ఆడియన్స్ ను మెప్పించాడు. అయితే, గత కొంతకాలంగా ఈ దర్శకుడు వెండితెరకు దూరంగా ఉండటంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Siri Hanmanth: చిల్ మోడ్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. ఫ్రెండ్స్‌తో సిరి ఎంజాయ్‌మెంట్.. ఫొటోలు
తాజాగా ఈ విలక్షణ దర్శకుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ హీరో ప్రదీప్ రంగనాథన్‌తో చంద్రశేఖర్ యేలేటి చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘డ్యూడ్’ అనే సినిమా చేశారు. ఇప్పుడు అదే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విభిన్నమైన టేకింగ్‌తో సినిమాలు తీసే దర్శకుడు, తన ఎనర్జీతో యువతను ఆకట్టుకునే హీరో జతకట్టడం నిజంగా క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. యేలేటి మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది అని టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అనేది చూడాలి.
