Lik OTT: ‘Lik’ మూవీ ఓటీటీ న్యూస్.. అనుకున్న డేట్ కంటే ముందే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీకి రానున్న లేటెస్ట్ మూవీ 'Lik'(Lik OTT).
- V Santhosh Kumar
- Published On : April 13, 2026 / 06:04 PM IST
pradeep ranganathan lik movie ott streaming update
- lik ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్
- మిశ్రమ స్పందన రావడంతో ముందే ఓటీటీకి
- త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
Lik OTT: తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Lik)(Lik OTT) భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. విభిన్నమైన టైటిల్, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రమోషన్స్ నిర్వహించడంతో యువతలో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే, విడుదలైంది మొదలు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. కథలోని లోపాలు, ఆశించిన స్థాయిలో కంటెంట్ వల్ల ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ రావడంతో, సినిమా వసూళ్లు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
Pochamma: ఆహాలో మిస్టికల్ థ్రిల్లర్ ‘పోచమ్మ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
థియేట్రికల్ రన్ ఆశించిన రీతిలో లేకపోవడంతో, చిత్ర బృందం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌పై దృష్టి పెట్టింది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తాయి, కానీ ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో అనుకున్న సమయం కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 30 లేదా మే 8వ తేదీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. నిజానికి మే నెలాఖరులో డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని భావించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఫలితం తారుమారు కావడంతో ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రీ-పోన్‌మెంట్ తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
