Prasad Behara tells about his Planing on World Tour
నటుడు ప్రసాద్ బెహరా యూట్యూబ్ లో సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అనంతరం సినిమా అవకాశాలతో బిజీ అయ్యాడు. ఈ మధ్యలో ఓ నటి చేసిన లైంగిక ఆరోపణలతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు ప్రసాద్ బెహరా.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహరా ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
ప్రసాద్ బెహరా మాట్లాడుతూ.. నేను రూపాయి కూడా లేకుండా నడుచుకుంటూ వరల్డ్ టూర్ కి వెళ్ళాలి అనుకున్నా. అలా వెళ్లొచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని తినడమే. ఓ రెండు జతల బట్టలు పెట్టుకొని నడుచుకుంటూ ప్రపంచమంతా తిరగాలి అనుకున్నాను. ఆరు నెలల నుంచి ప్లాన్ చేసుకున్నా. గత సంవత్సరం డిసెంబర్ 31కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ వెళ్ళిపోదాం అనుకునేలోపు ఆ సంఘటన జరిగి అరెస్ట్ అయ్యాను. అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అన్నిటికి ప్రిపేర్ అయి వెళ్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు వెళ్ళలేను, పరిస్థితులు అలా ఉన్నాయి అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : OG షూటింగ్ షెడ్యూల్ పూర్తి.. ముంబై నుంచి పవన్ రిటర్న్..? OG కి మళ్ళీ బ్రేక్..