Prasanth Varma : మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే అంటున్న దర్శకుడు.. అంటే చిరంజీవేనా..?

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే అంటున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అంటే జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రని చిరంజీవే పోషిస్తున్నారా..?

Prasanth Varma : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాతో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ యూనివర్స్ లో రానున్న 20ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ‘అధీరా’ మూవీ షూటింగ్ జరుగుతుందట. ఈ సినిమాతో నిర్మాత డివివి దానయ్య వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ మూవీ షూటింగ్ తో పాటు ‘జై హనుమాన్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. కాగా ఈ మూవీలో హనుమాన్ రోల్ ని ఎవరు పోషిస్తున్నారని ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకుంది. ఈ పాత్రని చిరంజీవి పోషిస్తున్నారంటూ గత కొంతకాలంగా గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ మాత్రం.. దీని పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా హనుమాన్ 100 డేస్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also read : Pawan Kalyan : వదిన దగ్గర కూడా అప్పు తీసుకున్న పవన్.. ఎలక్షన్ అఫిడవిట్‌లో వివరాలు..

“మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే. నమ్మకం పెట్టుకోండి, మీరు అనుకున్న స్థాయిలోనే సినిమా ఉంటుంది. మీ ప్రతి పాజిటివ్ అండ్ నెగటివ్ కామెంట్ ని కూడా నేను చదువుతున్నాను. వాటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాను” అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ కామెంట్స్ విన్న ఆడియన్స్ లో హనుమాన్ పాత్రని చిరంజీవే పోషిస్తున్నారు అనే నమ్మకం మరింత పెరిగిపోయింది. మరి ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేసాడో చూడాలి.

కాగా హనుమాన్ సినిమాలో కనబడిన ప్రతి పాత్ర జై హనుమాన్ లో కనిపిస్తుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే సూపర్ హీరో సినిమాల్లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీకి సంబందించిన స్టార్ హీరోలు కనిపించబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో రాబోయే సినిమాలు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు