Salaar 2 Movie : సలార్ 2 అప్డేట్.. త్వరలో ప్రభాస్‌ని కలవనున్న ప్రశాంత్ నీల్.. ఎందుకంటే?

సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Salaar 2 Movie : సలార్ 2 అప్డేట్.. త్వరలో ప్రభాస్‌ని కలవనున్న ప్రశాంత్ నీల్.. ఎందుకంటే?

Prashanth Neel Prabhas Salaar 2 Movie Update

Salaar 2 Movie : బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ కి తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అందించాడు. గత డిసెంబర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజయి భారీ విజయం సాధించి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ సినిమాపై ఉన్న అంచనాల్ని అందుకొని ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది.

ఇక సలార్ 2 కూడా ఉందని ముందే ప్రకటించారు. సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు.

Also Read : Sreeleela : మొత్తానికి తమిళ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో..

తాజా సమాచారం ప్రకారం సలార్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని కలిసి సలార్ 2 కథ మొత్తం డైలాగ్ వర్షన్ తో వినిపించనున్నారట. ప్రభాస్ తో పటు మిగిలిన యాక్టర్స్ ని కూడా కలిసి సలార్ 2 నేరేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే పార్ట్ 1లో ఉన్న శృతిహాసన్, శ్రియారెడ్డి, బాబీ సింహ, పృథ్విరాజ్ సుకుమారన్.. లాంటి స్టార్ యాక్టర్స్ తో పాటు మరింతమంది యాక్టర్స్ కూడా సలార్ 2లో కొత్తగా చేరనున్నట్టు తెలుస్తుంది. కల్కి ఆల్రెడీ షూట్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. రాజాసాబ్ కూడా షూటింగ్ పూర్తిచేసుకుంటే 2025 లో ప్రశాంత్ నీల్ సలార్ 2 షూట్ మొదలుపెడతారని సమాచారం.