Sreeleela : మొత్తానికి తమిళ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో..
తాజాగా శ్రీలీల తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

Sreeleela ready to Debut in Tamil Movie with Star Hero Rumours goes viral in Kollywood
Sreeleela : టాలీవుడ్ లో ఒక్కసారిగా రైజ్ అయిన హీరోయిన్ శ్రీలీల. గత సంవత్సరం శ్రీలీల నుంచి వరుసగా నెలకొక సినిమా వచ్చింది. అందులో కొన్ని హిట్ అవ్వగా, కొన్ని ఫ్లాప్స్ కూడా చూసింది. చివరగా ఇటీవల సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టింది శ్రీలీల. ఇక ఇప్పట్లో శ్రీలీల దగ్గర్నుంచి వచ్చే సినిమాలేవి లేవు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు సమాచారం.
తాజాగా శ్రీలీల తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల శ్రీలీల చెన్నైలో ఓ కాలేజీ ఈవెంట్ కి వెళ్లి అక్కడ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు తమిళ్ లో నేనెవరికీ తెలుసు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా నన్ను ఇంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారంటే కచ్చితంగా తమిళ్ సినిమాలు చేస్తాను అని తెలిపింది. అన్నట్టే ఇప్పుడు తమిళ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
Also Read : Fahad Faasil : మేమెన్ని హిట్స్ కొట్టినా మలయాళం సినిమాలను ఓటీటీలు పట్టించుకోవట్లేదు..
ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో అజిత్(Ajith) హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మన తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీలీల ఓ ముఖ్య పాత్ర చేయబోతోందని టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు అజిత్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రకు ఓకే చెప్పిందని, త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటుందని తమిళ సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. మొత్తానికి అజిత్ సినిమాతో శ్రీలీల తమిళ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ కూడా శ్రీలీల బిజీ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO
— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024