Prashanth Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో ఆ ఎలిమెంట్ లేనట్టే.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ కి నిరాశే
తనకు సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచన ఎప్పుడూ రాలేదన్న ప్రశాంత్ నీల్(Prashanth Neel).
- V Santhosh Kumar
- Updated on- May 20, 2026 / 07:09 PM IST
Prashanth neel said that he is not interested in cinematic universe
- ‘డ్రాగన్’, ‘సలార్’ మధ్య ఎలాంటి లింక్ లేదు
- సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన ఎప్పుడూ రాలేదు
- కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తాను
Prashanth Neel: టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో సరికొత్త అంచనాలను రేకెత్తించింది. అయితే, ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహాలోనే ఈ ‘డ్రాగన్’ సినిమాకు కూడా ఏదైనా లింక్ ఉంటుందని, ఇది కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
Prashanth neel: నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయంటారు.. ఆ కామెంట్స్ విన్నప్పుడు.. నాకు నచ్చింది చేస్తాను
ఈ ప్రచారానికి దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తన తాజా ఇంటర్వ్యూలో స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘డ్రాగన్’ కథకు, ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. టీజర్ చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆశించినప్పటికీ, అలాంటి ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చెప్పి నీల్ మెగా అప్‌డేట్ ఇచ్చారు. దీంతో రెండు సినిమాల మధ్య కనెక్షన్ ఆశించిన అభిమానులకు కాస్త నిరాశే మిగిలిందని చెప్పాలి.
ఇదే విషయమై ఆయన మరింత స్పందిస్తూ.. తాను కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తానని, ఒకవేళ క్రాస్ ఓవర్స్ చేసి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక్కో సినిమా పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వెల్లడించారు. అలా చేయడం నచ్చకపోవడం అని కాదు కానీ, ‘డ్రాగన్’ను ఒక పూర్తి స్థాయి వైవిధ్యమైన, స్వతంత్రమైన కథాంశంతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
