Aryan Khan: మునుపటి లాయర్లు అసమర్థులా.. ఆర్యన్ బెయిల్‌పై ఆర్జీవీ పంచ్‌లు!
ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు..
- Naresh Mannam
- Published on- October 28, 2021 / 07:49 PM IST
Aryan Khan
Aryan Khan: ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా వున్న ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసు వ్యవహారం ఎలా ఉన్నా.. ఇన్నాళ్లు బాలీవుడ్ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపైనే ఎక్కువగా చర్చలు నడిచాయి.
Ketika Sharma: అట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పిల్ల.. క్యూ కడతారా?
అయితే, చివరికి ముంబై కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు స్పందించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సౌత్ నుండి కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా వారి భావాన్ని వ్యక్తపరిచారు. కాలమే సమాధానం చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు. నటుడు మాధవన్, నటి స్వర భాస్కర్ లాంటి వాళ్ళు కూడా ఇది ఒక బిగ్ రిలీఫ్ గానే ట్వీట్ చేశారు.
Tees Maar Khan: బీచ్ ఒడ్డున రొమాన్స్‌లో మునిగిన పాయల్, ఆది!
కానీ, ఒక్క ఆర్జీవీ మాత్రం ఈ అంశంపై అటు మన న్యాయ వ్యవస్థను.. అందులో లోపాలపై పంచ్ లు వేశారు. ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ప్రశ్నించిన ఆర్జీవీ.. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించుకోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు.
