Preyasi Raave : 26 ఏళ్ళ తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మళ్ళీ వాళ్ళతోనే..

అలాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు చంద్ర మహేష్. (Preyasi Raave)

  • Published On : March 21, 2026 / 01:38 PM IST

Preyasi Raave

Preyasi Raave : శ్రీకాంత్, రాశి జంటగా పృథ్వీ, శివాజీ రాజా కీలక పాత్రల్లో 1999లో వచ్చిన ప్రేయసి రావే సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమా పాటలు ఇప్పటికి వింటూ ఉంటారు. ప్రేయసి రావే క్లైమాక్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టాల్సిందే. అలాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు చంద్ర మహేష్.

ప్రేయసి రావే చంద్ర మహేష్ కి మొదటి సినిమా. ఆ తర్వాత అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం.. లాంటి పలు సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న దర్శకుడు చంద్ర మహేష్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, పలువురు కొత్తవాళ్లతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also See : Punarnavi Bhupalam : నటి పునర్నవి భూపాలం పెళ్లి ఫొటోలు చూశారా..?

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చంద్ర మహేష్ మాట్లాడుతూ.. ప్రేయసి రావే చేసి 26 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేశాను అని నాకు గుర్తు ఉంది. ప్రేయసి రావే సీక్వెల్ కి అద్భుతమైన కథ రెడీ చేశాను. మళ్ళీ శ్రీకాంత్, రాశి, శివాజీ రాజా, పృథ్వీ అందరూ నటిస్తారు. ఈసారి పృథ్వీ గారు విలన్ పాత్ర చేస్తారు. శ్రీలేఖ గారు అంతకు మించి మ్యూజిక్ ఇస్తారు అని అన్నారు.

దీంతో ప్రేయసి రావే సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తుంది. అయితే ఆ సినిమా క్లైమాక్స్ లో శ్రీకాంత్ పాత్ర చనిపోతుంది. మరి సీక్వెల్ లో ఉంటాడా? లేక అప్పటి నటీనటులనే పెట్టి మరో కొత్త కథతో తెరకెక్కిస్తారా చూడాలి.

Also Read : Dhurandhar 2 Collections : ధురంధర్ 2 రెండు రోజుల కలెక్షన్స్ .. ఎన్ని వందల కోట్లు..?