Ram Charan: స్వయంగా మోదీ అడిగారు.. ‘పెద్ది’ మూవీ వికసిత్ భారత్ అని చెప్పాను: రామ్ చరణ్
రామ్ చరణ్(Ram Charan) పెద్ది సినిమా గురించి అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ.
- V Santhosh Kumar
- Published on- May 28, 2026 / 03:18 PM IST
Prime Minister Modi asked about movie Peddi Ram Charan replied Viksit Bharat
- చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల.
- ప్రధాని మోదీ సినిమా గురించి అడిగారు.
- ఇది ‘వికసిత్ భారత్’ చిత్రం: చరణ్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది.
OG Satellite Rights: ఇది అస్సలు ఊహించలేదు.. ‘ఓజీ’ శాటిలైట్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
ప్రస్తుతం మూవీ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఒకపక్క బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, మరోపక్క భారీ ప్రెస్ మీట్స్‌తో హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా, ఢిల్లీ సర్కిల్స్‌లో కూడా దీని గురించిన చర్చ గట్టిగానే నడుస్తోంది.
ఈ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ (Ram Charan)మాట్లాడుతూ ఒక షాకింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. గతంలో నేను ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన కొత్త సినిమా ‘పెద్ది’ గురించి అడిగి తెలుసుకున్నారని చరణ్ వెల్లడించారు. “మోదీ గారు పెద్ది గురించి అడిగినప్పుడు.. ఇది మన దేశ మూలాలను, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమని, ఇది పక్కా ‘వికసిత్ భారత్’ సినిమా అని ఆయనకు చెప్పాను” అని చరణ్ గర్వంగా పేర్కొన్నారు. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న పెద్ది సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
