Prithvi shaw-Prachi singh : బాలీవుడ్ హీరోయిన్‌తో యువ క్రికెటర్ ప్రేమాయణం

యువ క్రికెటర్‌ పృథ్విషా కొంతకాలంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ సింగ్‌తో చాలా కోజ్ గా ఉంటూ పార్టీలకు, షాపింగ్స్ కి వెళ్తున్నారు. పృథ్వీ, ప్రాచీ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్.....

Prachi Singh Prithvi Shaw

Prithvi shaw-Prachi singh :   బాలీవుడ్ హీరోయిన్స్‌ ఎక్కువగా క్రికెటర్లతో ప్రేమలో పడటం చాలా సాధారణం. గతంలో చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారం నడిపిన వారే. అందులో కొందరు బ్రేకప్‌ చెప్పుకొని వెళ్లిపోగా కొంతమంది పెళ్లి పీటల వరకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. తాజాగా మరో క్రికెటర్ బాలీవుడ్ భామతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యువ క్రికెటర్‌ పృథ్విషా కొంతకాలంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ సింగ్‌తో చాలా కోజ్ గా ఉంటూ పార్టీలకు, షాపింగ్స్ కి వెళ్తున్నారు.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి పార్టీలకు, డిన్నర్‌ డేట్స్‌ వెళుతూ చాలా సార్లు కెమారాలకు చిక్కారు. వీరు డైరెక్ట్ గా చెప్పకపోయినా పృథ్వీ, ప్రాచీ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా వీరి ఫోటోలు, వీరి పోస్టులకి ఒకరికొకరు కామెంట్స్ ఇచ్చుకోవడాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి వీరిద్దరూ కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేశారు.

Nani : సమ్మర్ బరిలో సుందరం… నానికి మరో హిట్ గ్యారెంటీ..

న్యూ ఇయర్ సందర్భంగా పృథ్వీషాతో క్లోజ్‌గా దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ప్రాచి షేర్‌ చేసింది. పృద్విని హత్తుకొని ఉన్న ఈ ఫొటోతో వీరి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిందా? లేదా అని నెటిజన్లు అడుగుతున్నారు. నెటిజన్లు ఇప్పటికే వీరి జంట గురించి అడిగినా వీళ్ళు మాత్రం స్పందించట్లేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వీళ్ళకే తెలియాలి.