Suyodhana OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘సుయోధన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్ గా ఓటీటీకి వచ్చేసిన ప్రియదర్శి సుయోధన(Suyodhana OTT) మూవీ.

priyadarshi suyodhana movie now streaming on amazon prime and jio hotstar

Suyodhana OTT: కమెడియన్‌ నుంచి హీరోగా మారిన ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ‘సుయోధన’. థ్రిల్లర్ జానర్ తెరకెక్కిన ఈ సినిమాను వైఎస్ మాధవరెడ్డి తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 27న థియేటర్లలోకి వచ్చింది. కానీ, ఆడియన్సన్ నుంచి మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది ఈ మూవీ. కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Prakash Raj: శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘వలస కూలీ’ అంటూ అవహేళన చేయడంపై నెటిజన్ల ఆగ్రహం

అయితే, విడుదలై నెల గడుస్తున్నా సందర్బంగా తాజాగా ఈ సినిమా ఓటీటీలో(Suyodhana OTT)కి వచ్చేసింది ఈ మూవీ. అయితే ఒకటి కాదు రెండు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి, థియేటర్స్ లో ఆశించిన ఫలితం దక్కించుకొని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.