Priyamani Husband : ప్రియమణితో నా భర్త పెళ్లి అక్రమం.. మొదటి భార్య అయేషా ఆరోపణలు..
తన భర్తపై మొదటి భార్య చేసిన ఆరోపణల గురించి ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి..
- sekhar
- Published On : July 22, 2021 / 05:56 PM IST
Priyamani Husband
Priyamani Husband: హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. కొద్దికాలంగాి తెలుగులో ఓ పాపులర్ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ తనకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. వెంకటేష్‌తో నటించిన ‘నారప్ప’ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాకుండా ప్రియమణి చేసిన సుందరమ్మ క్యారెక్టర్‌కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.
Narappa : విక్టరీ వెంకటేష్ వన్‌మెన్ షో ‘నారప్ప’..
కాస్త గ్యాప్ వచ్చినా ప్రొఫెషనల్ లైఫ్ అయితే బాగానే ఉంది కానీ పర్సనల్ లైఫ్‌లో భర్త కారణంగా వార్తల్లో నిలిచింది ప్రియమణి. 2017లో కేరళకు చెందిన బిజినెస్‌మెన్ ముస్తఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లాడింది ప్రియమణి. అప్పటికే అతనికి భార్య అయేషా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో 2010 నుండే విడివిడిగా ఉంటున్నారు.
అయితే ప్రియమణిని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య అయేషా, పిల్లల కోసం ప్రతి నెలా కొంత అమౌంట్ పంపిస్తూ వస్తున్నాడు ముస్తఫా.
ఇప్పుడు తన భర్త.. పిల్లలను పట్టించుకోవడం లేదంటూ అయేషా మీడియాకు చెప్పింది. ‘ఆమె ఆరోపణలు అవాస్తవం. పిల్లల కోసం రెగ్యులర్‌గా డబ్బు పంపిస్తున్నాను. నా దగ్గరనుండి మరింత డబ్బు లాగాలని చూస్తుంది. పైగా నేను హింసించానని చెప్తోంది. మరి హింసిస్తే ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకు ఉంది..?’ అంటూ ముస్తఫా తన వెర్షన్ చెప్పాడు.
అయితే అయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ భర్త కాడు, ఇప్పటికే తన భర్తేనని చెప్తోంది. పైగా ప్రియమణితో అతని పెళ్లి చెల్లదని, ఆమెను మ్యారేజ్ చేసుకోవడానికి ముందు మేం విడాకుల కోసం కూడా అప్లై చేసుకోలేదని అంటుంది. కాబట్టి ప్రియమణితో ముస్తఫా పెళ్లి అక్రమమే కానీ సక్రమం కాదు, ఒకవేళ ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది అయేషా. మరి తన భర్తపై మొదటి భార్య చేసిన ఆరోపణల గురించి ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి.
