Priyanka Chopra
Priyanka Chopra : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన ప్రియాంక కాస్త గ్యాప్ తో మళ్ళీ వారణాసి తోనే ఇండియన్ సినిమాలోకి వస్తుంది. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.(Priyanka Chopra)
రాజమౌళి హాలీవుడ్ టార్గెట్ పెట్టుకొని అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ రిలీజవ్వగా అందులో ప్రియాంక ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను చాన్నాళ్లుగా డ్యాన్స్ చేయలేదు. డ్యాన్స్ ఉన్న పాత్ర చేసి చాలా రోజులైంది. హిందీ సినిమా నుంచి వచ్చాను కాబట్టి అక్కడ డ్యాన్స్ చాలా స్పెషల్. డ్యాన్స్ హిందీ సినిమాల్లో బిగ్ పార్ట్. అందుకే నేను ఈ సినిమాలో డ్యాన్స్ ఉండాలి అని అడిగాను రాజమౌళిని. మహేష్ ఎలాగో క్యూట్ ఉంటాడు కాబట్టి ఆ రిక్వెస్ట్ చేసినందుకు హ్యాపీగానే ఉన్నాను. స్టెప్స్ గురించి నేను ఆలోచించలేదు అవి బాగానే వస్తాయి అని అంది.
దీనికి మహేష్ బాబు కూడా స్పందిస్తూ.. ఈ సినిమా చేసే ముందు కూడా ప్రియాంక డ్యాన్స్ ఉంటుందా అని అడిగింది. నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది అని గొప్పగా చెప్తూ ఈ సినిమాలో డ్యాన్స్ గురించి అడిగింది. తనతో కాస్త టఫ్ గానే ఉంది అని అన్నారు.
Also See : ‘వారణాసి’ హాలీవుడ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
దీంతో వారణాసి సినిమాలో మహేష్ – ప్రియాంక చోప్రా కాంబోలో ఒక స్పెషల్ సాంగ్, అందులో ఈ ఇద్దరి డ్యాన్స్ ఉండటం పక్కా అని తెలుస్తుంది.