Allu Arjun: గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు.. అల్లు అర్జున్- అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది
అల్లు అర్జున్(Allu Arjun) బర్త్ డే రోజున అట్లీ సినిమా నుంచి అప్డేట్ రానుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన నిర్మాత బన్నీ వాసు.
- V Santhosh Kumar
- Published On : March 31, 2026 / 07:36 PM IST
Producer Bunny Vas shares interesting update on Allu Arjun-Atlee movie
- బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసిన అట్లీ
- ఏప్రిల్ 8న టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్
- సస్పెన్స్‌కు తెరదించనున్న మేకర్స్.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిర్మాత బన్నీ వాసు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పుష్ప 2 లాంటి భారీ విజయం తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయినా టైటిల్, అల్లు అర్జున్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు బన్నీ వాసు స్వయంగా వెల్లడించారు.
Tovino Thomas: ‘డ్రాగన్’ కోసం నా సినిమాలు వదులుకోలేను.. షాకింగ్ కామెంట్స్ చేసిన టొవినో థామస్
తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘పళ్లి చట్టంబి’ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. బన్నీ(Allu Arjun) బర్త్‌డే రోజున ఏదైనా గిఫ్ట్ ఉంటుందా అని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ మాస్ లుక్ తో స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ‘AA 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా వంటి పాపులర్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి అట్లీ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఖరారు చేశారో, హీరోయిన్ల విషయంలో ఉన్న సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.
