Dil Raju : సినిమాల్లో, బయట ఈవెంట్స్ లో పాటలు పాడటానికి ఒకప్పుడు కేవలం సింగర్స్ మాత్రమే ఉండే వాళ్ళు. ఇటీవల అందరూ సింగర్స్ గా మారుతున్నారు. ఇక సినిమాల్లో అయితే ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పాటలు పడేస్తున్నారు. మన స్టార్ హీరోలంతా సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళే. ఇక కొంతమంది ఈవెంట్స్ లో స్టేజిపై తమ గొంతుని విప్పుతారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా సింగర్ లా మారారు.
Nagarjuna : 1000 ఎకరాలు దత్తత తీసుకుంటున్న నాగార్జున
నిన్న కరీంనగర్ లో ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ అనే రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. గెస్ట్ గా వెళ్లిన దిల్ రాజుని అక్కడ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాండ్ స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడమని కోరగా దిల్ రాజు మొదట నో చెప్పినా తర్వాత మైక్ అందుకొని పడేసారు. ‘హలో గురు ప్రేమ కోసమే జీవితం’ అంటూ నాగార్జున ‘నిర్ణయం’ సినిమాలోని పాటను దిల్ రాజు స్టేజిపై పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పాట విన్న తర్వాత దిల్ రాజు లోను మంచి సింగర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తే కచ్చితంగా దిల్ రాజుతో సినిమాలో పాటలు పాడిస్తారేమో. దిల్ రాజు పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening 😉 pic.twitter.com/pgpTFZpFij
— Milagro Movies (@MilagroMovies) December 12, 2021