Naga Vamsi : టిల్లు పార్ట్ 3 కన్ఫర్మ్.. ఆ రోజే సిద్ధూ అనౌన్స్ చేస్తాడు..

ముందు నుంచి కూడా ఈ టిల్లు సినిమాలకు మరిన్ని సీక్వెల్స్ ఉంటాయని, ఒక సిరీస్ సినిమాల లాగా అయిదారు సినిమాలు చేస్తానని గతంలో సిద్ధూ చెప్పాడు.

Naga Vamsi : టిల్లు పార్ట్ 3 కన్ఫర్మ్.. ఆ రోజే సిద్ధూ అనౌన్స్ చేస్తాడు..

Producer Naga Vamsi Comments on one more Tillu Sequel will announce by Siddhu in Soon

Producer Naga Vamsi : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా నిన్న రిలీజయి మంచి విజయమే సాధించింది. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా దానికి మించి ప్రేక్షకులని మెప్పిస్తుంది. టిల్లు స్క్వేర్ కి ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు.

అయితే ముందు నుంచి కూడా ఈ టిల్లు సినిమాలకు మరిన్ని సీక్వెల్స్ ఉంటాయని, ఒక సిరీస్ సినిమాల లాగా అయిదారు సినిమాలు చేస్తానని గతంలో సిద్ధూ చెప్పాడు. దీంతో టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు పార్ట్ 3 కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.

Also Read : Anupama Parameswaran : సిద్ధుని బాగా హేట్ చేశాను.. ఈ సినిమా చేయాలనిపించలేదు.. నన్ను సరిగ్గా పట్టించుకోలేదు..

నిర్మాత నాగవంశీ టిల్లు స్క్వేర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమాకు కూడా డీజే టిల్లులాగా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సినీ పరిశ్రమ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, అభిమానులు కూడా దీనికి సీక్వెల్ ఉందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక చిన్న ఐడియా అనుకున్నాం. దాంతో టిల్లు పార్ట్ 3 తీస్తాం. హీరో సిద్ధూ సోమవారం అధికారికంగా దీని గురించి ప్రకటిస్తాడు అని తెలిపారు. ఇక రాబోయే సీక్వెల్ కి టిల్లు క్యూబ్ అని టైటిల్ పెడతారని సమాచారం. దీంతో టిల్లు సినిమా అభిమానులు టిల్లు పార్ట్ 3 కూడా ఫిక్స్ అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.