Anupama Parameswaran : సిద్ధుని బాగా హేట్ చేశాను.. ఈ సినిమా చేయాలనిపించలేదు.. నన్ను సరిగ్గా పట్టించుకోలేదు..

అనుపమ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ గురించి, సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Anupama Parameswaran : సిద్ధుని బాగా హేట్ చేశాను.. ఈ సినిమా చేయాలనిపించలేదు.. నన్ను సరిగ్గా పట్టించుకోలేదు..

Anupama Parameswaran Sensational Comments on Siddhu Jonnalagadda Behaviour and Tillu Square Movie

Updated On : March 30, 2024 / 7:13 AM IST

Anupama Parameswaran : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా నిన్న రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకుంది ఈ సినిమా. అనుపమ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ గురించి, సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అనుపమ మాట్లాడుతూ.. మొదటి రోజు సెట్ కి వచ్చినప్పుడు సిద్ధూ కనీసం హాయ్ కూడా చెప్పలేదు. తన పని తాను చూసుకుంటున్నాడు. సడెన్ గా నా దగ్గరికి వచ్చి నన్ను అలాగే కాసేపు చూసి నా కాటుక, ఐబ్రోస్ గురించి సరిగ్గా లేవు అని మాట్లాడాడు. నేను షాక్ అయ్యాను. ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకున్నాను. సిద్ధూని బాగా హేట్ చేశాను. తనతో కూడా నీతో వర్క్ చేయడం నాకు నచ్చట్లేదు అంటే సింపుల్ గా అది నీ ఇష్టం అని అన్నాడు. నేను షాక్ అయ్యాను, అతని బిహేవియర్ కూడా నచ్చలేదు. వెంటనే కారవాన్ కి వెళ్లి మేనేజర్ కి కాల్ చేసి ఈ సినిమా నేను చేయాలనుకోవట్లేదు, ఇక్కడ అంతా వెరైటీగా ఉన్నారు అని చెప్పాను. కానీ తర్వాత అర్థమైంది సిద్ధూ ఈ సినిమాకి రైటర్ కూడా అని. టిల్లు క్యారెక్టర్ లోనే బయట కూడా ఉంటున్నాడని, వర్క్ తో స్ట్రెస్ లో ఉన్నాడని అర్ధం చేసుకున్నాను అని తెలిపింది. దీంతో అనుపమ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Also Read : Daniel Balaji : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ నటుడు కన్నుమూత.. ‘చిరుత’లో విలన్‌గా..

అయితే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత లిల్లీ పాత్రలో అనుపమ ఒదిగిపోయిందని, ఓ పక్క రొమాన్స్ తో,మరో పక్క నటనతో మెప్పించింది అని అంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు అనుపమ ఈ పాత్రకి 100 శాతం న్యాయం చేసిందని అంటున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.