Daniel Balaji : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ నటుడు కన్నుమూత.. ‘చిరుత’లో విలన్‌గా..

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నిన్న అర్ధరాత్రి స్టార్ నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మరణించారు.

Daniel Balaji : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ నటుడు కన్నుమూత.. ‘చిరుత’లో విలన్‌గా..

Tamil Star Actor Daniel Balaji Passes Away with Heart Attack

Updated On : March 30, 2024 / 6:37 AM IST

Daniel Balaji : తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నిన్న అర్ధరాత్రి స్టార్ నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మరణించారు. డానియల్ బాలాజీ తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీశ్.. లాంటి పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. తమిళ్ లో మాయావన్, బిగిల్, వడాచెన్నై.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తమిళ్ స్టార్ నటుడు విజయ్ కి డానియల్ బాలాజీ మంచి సన్నిహితుడు.

డానియల్ బాలాజీకి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో అతను మరణించాడు. డానియల్ బాలాజీ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 48 ఏళ్లకే బాలాజీ ఇలా హఠాత్తుగా మరణించడంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు అతనికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Also Read : Ranbir Kapoor : ఏడాదిన్నర కూతురికి బంగ్లాని బహుమతిగా ఇచ్చిన రణ్‌బీర్.. దాని విలువ తెలిస్తే షాక్ అవుతారు..

నేడు శనివారం పురసైవల్కంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి అంత్యక్రియలు చేస్తారని సమాచారం. డానియల్ బాలాజీ దేవుడ్ని బాగా నమ్ముతాడు. రెగ్యులర్ గా పూజలు చేస్తారు. తమిళనాడులోని ఆవడిలో ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తి అవ్వకుండానే ఇలా మరణించడంతో ఆ ఊరి ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.