Nagavamsi : హీరోలకు, దర్శకులకు లేని బిజీ హీరోయిన్స్ కు ఏం ఉంటుంది.. నాగవంశీ వ్యాఖ్యలు వైరల్..
తాజాగా నిర్మాత నాగవంశీ కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. (Nagavamsi)
- Saketh U
- Published on- September 7, 2026 / 09:27 PM IST
Nagavamsi
Nagavamsi : నిర్మాత నాగవంశీ తన సినిమాలతోనే కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలతో, నాగవంశీ చేసే కామెంట్స్ తో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా నిర్మాత నాగవంశీ కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఈ సినిమా స్పై థ్రిల్లర్ కావడంతో.. మీరు ఒకవేళ స్పై చేస్తే ఎవరి లైఫ్ లో స్పై చేయాలి అనుకుంటారు అని యాంకర్ సుమ అడిగింది.
దీనికి నాగవంశీ సమాధానమిస్తూ.. సినిమా వాళ్ళం కాబట్టి హీరోయిన్స్ ని ఎప్పుడన్నా ప్రమోషన్స్ కి డేట్స్ అడిగితే లేదు మేము బిజీగా ఉన్నాము, రాలేము అని చెప్తారు. అసలు నిజంగా వీళ్ళు ఏం బిజీ ఉన్నారో కనుక్కుందాం అని ఉంటుంది. హీరోలకు, దర్శకులకు లేని బిజీ హీరోయిన్స్ కు మాత్రమే ఎలా ఉంటుంది అని కనుక్కోవాలి. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది బిజీగా లేకపోయినా బిజీ ఉన్నారని చెప్తారేమో అని. నిజంగా వీళ్ళు అంత బిజీగా ఉంటారా? మనకు తెలియని బిజీ సినిమా ఇండస్ట్రీలో ఏంటో తెలుసుకోవాలి అని అన్నారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి నాగవంశీకి బిజీ అని చెప్పిన హీరోయిన్స్ ఎవరో, ఈ కామెంట్స్ మీద ఎవరైనా హీరోయిన్స్ స్పందిస్తారేమో చూడాలి.
