SKN: ’నోటి ** తగ్గించుకో..‘ ‘పెద్ది’పై SKN కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన నిర్మాత
పెద్ది విడుదలై చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పిన నిర్మాత SKN(SKN).
- V Santhosh Kumar
- Published On : March 31, 2026 / 05:10 PM IST
Producer SKN shocking comments on peddi release date
- సోషల్ మీడియాలో SKN వర్సెస్ మెగా ఫ్యాన్స్
- బాధ్యత లేకుండా మాట్లాడొద్దంటూ ట్రోల్
- క్షమాపణలు చెప్పిన నిర్మాత SKN
SKN: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం అందరి దృష్టి ‘పెద్ది’ సినిమాపైనే ఉంది. సంక్రాంతి సీజన్ తర్వాత సరైన విజయం లేక వెలవెలబోతున్న ఇండస్ట్రీకి ఈ సినిమా ఊపిరి పోస్తుందని సినిమా ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలపై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి, ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ వాయిదా పడటంతో ఏప్రిల్ 30కి (SKN)షెడ్యూల్ రిలీజ్ డేట్ మారింది. కానీ, తాజాగా ఈ సినిమా జూన్ 25కి వెళ్లే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా ఒక న్యూస్ వైరల్ గా మారింది.
Nani- Muralikanth- Naslen: నాని నిర్మాణంలో ‘ప్రేమలు’ హీరో.. ‘దండోరా’ దర్శకుడితో క్రేజీ ప్రాజెక్ట్
ఈ న్యూస్ వల్ల ప్రముఖ నిర్మాత SKN వివాదంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి SKN నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా మొదటి సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో SKN మాట్లాడుతూ ‘పెద్ది’ విడుదల తేదీ గురించి నోరు జారడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈవెంట్‌లో తన సినిమా విడుదల గురించి చెబుతూ, ‘పెద్ది’ జూన్ 25న వస్తుందని అనుకోకుండా అనేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందించిన SKN.. అది కేవలం మిస్ కమ్యూనికేషన్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ న్యూస్ గురించి సాయి రాజేష్ తనకు చెప్పగా, అధికారిక ప్రకటన రాకముందే తాను పొరపాటున మాట్లాడానని, అందుకు క్షమించాలని ఆయన కోరారు. పెద్ద హీరోల సినిమాలు లేని సమయం ‘చెన్నై లవ్ స్టోరీ’ని విడుదల చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.
IMP CLARIFICATION: pic.twitter.com/EgRUO0c7A2
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 30, 2026
