×
Ad

Puneeth Rajkumar : పునీత్ చివరి చిత్రం.. కన్నడ డిస్ట్రిబ్యూటర్ల గొప్ప నిర్ణయం..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదలకు రెడీ అయింది. మార్చి17న 'జేమ్స్' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు..........

  • Published On : January 27, 2022 / 07:25 AM IST

James

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన చేసిన ఎన్నో సేవలని గుర్తు చేసుకున్నారు.

అయితే ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదలకు రెడీ అయింది. మార్చి17న ‘జేమ్స్’ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ‘జేమ్స్’ స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌గా నటించారు.

Anasuya : వివాదంలో అనసూయ.. వందేమాతరం నిల్చొని పాడలేదంటూ..

మార్చి 17న పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమాని ఆ రోజు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. దీంతో మార్చి 17 నుంచి 23 మధ్యలో కన్నడలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. పునీత్ కి నివాళిగా ఆయన చివరి సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో కర్ణాటకలో మార్చి 17 నుంచి 23 మధ్యలో ఎలాంటి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వవు. కన్నడ డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై పునీత్ అభిమానులతో పాటు, కన్నడ సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.