Puri Jagannadh : రవితేజ – నాగార్జున మల్టీస్టారర్ సినిమా.. పూరి జగన్నాధ్ ప్లాన్ చేసాడని తెలుసా? కానీ రవితేజని పక్కన పెట్టి..

పూరి జగన్నాధ్ నాగార్జున - రవితేజ లను కలిపి ఒక సినిమా చేయాలని ప్రయత్నించినా విషయం మీకు తెలుసా? (Puri Jagannadh)

  • Published on- November 2, 2026 / 02:05 PM IST

Puri Jagannadh

Puri Jagannadh : ఒకప్పుడు వరుస హిట్స్ తో, మాస్ హీరోయిజానికి కొత్త అర్ధం తీసుకువచ్చి ఇప్పటి మన స్టార్ హీరోలందరికీ కెరీర్లో బెస్ట్ రోల్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. రవితేజని హీరోగా నిలబెట్టింది కూడా పూరి జగన్నాధ్ అని అందరికి తెలిసిందే. అయితే పూరి జగన్నాధ్ నాగార్జున – రవితేజ లను కలిపి ఒక సినిమా చేయాలని ప్రయత్నించినా విషయం మీకు తెలుసా?

నాగార్జునతో శివమణి సినిమా చేసి మంచి హిట్ కొట్టాడు పూరి జగన్నాధ్. దాంతో నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చాడు. అప్పటికే రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూడు హిట్ సినిమాలు ఇచ్చాడు. అలాంటి సమయంలో నాగార్జున మరో సినిమా ఆఫర్ చేయడంతో పూరి జగన్నాధ్ నాగార్జున – రవితేజతో మల్టీస్టారర్ సినిమా చేద్దామనుకున్నాడు.

Also See : Archana Iyer : చీరకట్టులో అర్చన అయ్యర్ అందాలు.. ‘అ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో..

ఆ సినిమానే నాగార్జున – సోనూసూద్ కలిసి నటించిన ‘సూపర్’. నేనున్నాను సినిమా తర్వాత నాగార్జునకు ఈ కథ చెప్పగా ఓకే చేసారు. రవితేజని సోనూసూద్ పాత్ర అనుకున్నారు. మొదట వీళ్లిద్దరి కాంబోలోనే సినిమా ఫిక్స్ అయింది. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున కూడా ఇదే విషయం చెప్పారు. కానీ రవితేజ అప్పుడే హీరోగా ఫుల్ ఫామ్ లో ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో మళ్ళీ సెకండ్ రోల్ కావడంతో ఆలోచించి వెనుకడుగు వేసాడు.

దీంతో పూరి జగన్నాధ్ కథలో కొన్ని మార్పులు చేసి నాగార్జున మెయిన్ హీరోగా సోనూసూద్ కీలక పాత్రలో సూపర్ సినిమా తీసాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అలా పూరి జగన్నాధ్ ప్లాన్ చేసిన నాగార్జున – రవితేజ మల్టీస్టారర్ సినిమా మిస్ అయింది. కానీ అంతకుముందు రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేటప్పుడు నాగార్జున సీతారామరాజు, నిన్నే పెళ్లాడుతా.. పలు సినిమాల్లో నటించాడు.