Thabitha Sukumar : జిమ్‌లో కసరత్తులు చేస్తున్న.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ భార్య.. వీడియో వైరల్
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పుష్ప డైరెక్టర్ సుకుమార్ భార్య. వైరల్ అవుతున్న వీడియో చూశారా.

Pushpa 2 director sukumar wife Thabitha gym workout videos
Thabitha Sukumar : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక భర్త షూటింగ్ లో బిజీగా ఉంటే ఆయన భార్య తబిత జిమ్ లో కసరత్తులు చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు. తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తమ ఫ్యామిలీ విషయాలతో పాటు సినిమాలు విషయాలు కూడా షేర్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ ని సంపాదించుకున్నారు.
ఇక ఈమధ్య కాలంలో తబిత జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అక్కడ కసరత్తులు చేస్తూ హెల్త్ అండ్ బాడీ ఫిట్‌నెస్ పై ఫోకస్ పెట్టారు. జిమ్ లో కొత్త కొత్త వర్క్ అవుట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా మరో వీడియోని కూడా షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వర్క్ అవుట్ వీడియోస్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
Also read : Sree Vishnu : సామజవరగమన కాంబో ఈజ్ బ్యాక్.. ఆల్రెడీ షూటింగ్ సగం పూర్తి.. ఈసారి థ్రిల్లర్‌తో..
View this post on Instagram
View this post on Instagram
పుష్ప 2 విషయానికి వస్తే.. ఆగష్టు 15న వచ్చేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకు ఈ మూవీ రిలీజ్ కి నార్త్ లో ‘సింగం ఎగైన్’ చిత్రం అడ్డంకిగా ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా తొలిగిపోయింది. సింగం ఎగైన్ పోస్టుపోన్ అయ్యింది. దీంతో పుష్ప 2కి లైన్ క్లియర్ అయ్యింది. ఆగష్టు 15 లాగ్ వీకెండ్ తో వస్తుంది. ఈ మూవీకి ఉన్న హైప్, ఈ వీకెండ్ కలుపుకొని ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఉంది. మరి పుష్ప ఏం చేస్తాడో చూడాలి.