Pushpa 2 : ‘పుష్ప 2’.. సరికొత్త రికార్డు.. ఆనందంలో బన్నీ అభిమానులు.. భారతీయ సినీ పరిశ్రమలో మొదటి..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప ది రూల్ (Pushpa 2).
- Thota Vamshi Kumar
- Published On : August 12, 2023 / 08:17 PM IST
Pushpa 2 first look
Pushpa 2 first look : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప ది రూల్’ (Pushpa 2). ‘పుష్ప ది రైజ్'(Pushpa 1)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 1 బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవడమే అందుకు కారణం. ఇక చిత్ర బృందం సైతం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా.. తాజాగా పుష్ప 2 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ పోస్టర్‌ను విడుదల చేయగా 7 మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకుంది. భారతీయ సినీ పరిశ్రమలో 7 మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకున్న మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది.
ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టారా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tiger Nageswara Rao : మాస్ మహారాజ టైగర్ నాగేశ్వరరావు టీజర్ ఆ రోజే.. పాదం మోపిన రవితేజ..
రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోండగా ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) విలన్‌గా కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోండగా జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
