Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ సినిమా వర్క్ స్టార్ట్.. త్రివిక్రమ్ మూవీ లేనట్లేనా..!

అల్లు అర్జున్, అట్లీ సినిమా వర్క్ స్టార్ట్. తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సూర్య పిక్చర్స్ నిర్మించబోతుందట. మరి త్రివిక్రమ్ మూవీ లేనట్లేనా..!

Pushpa 2 star Allu Arjun Atlee movie story works start

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో ‘పుష్ప 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆగష్టులో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ తరువాత బన్నీ సినిమాల లైనప్ పై ఆసక్తి నెలకుంది. త్రివిక్రమ్‌, అట్లీ, సందీప్ రెడ్డి వంగతో మూవీలు చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో త్రివిక్రమ్‌ సినిమా ముందుగా స్టార్ట్ కానుందని కామెంట్స్ వినిపించాయి.

అయితే తాజాగా అట్లీ సినిమా స్పీడ్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సూర్య పిక్చర్స్ నిర్మించబోతుందట. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట. పుష్ప తరువాత అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నారని గట్టిగా టాక్ వినిపిస్తుంది.

Also read : Ajith Kumar : చిరంజీవికి పోటీగా అజిత్ కుమార్ రాబోతున్నాడా.. అలాగే పవన్ కళ్యాణ్..

దీంతో త్రివిక్రమ్ సినిమా లేనట్లేనా అనే సందేహం కలుగుతుంది. అయితే త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ తరువాత అల్లు అర్జున్ సినిమా విషయం కొంచెం పెండింగ్ లో పడినట్లు తెలుస్తుంది. మరి ఆ పెండింగ్ టైం తీసుకోని వస్తుందా..? లేదా పూర్తిగా ఆగిపోతుందా..? అనేది చూడాలి. కాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కే మూవీ సోషియో ఫాంటసీతో రాబోతుందని టాక్ వినిపించింది.

ఇక సందీప్ వంగ మూవీ విషయానికి వస్తే.. ప్రభాస్ తో తెరకెక్కించబోయే ‘స్పిరిట్’ కంప్లీట్ అయిన తరువాతే అల్లు అర్జున్ మూవీ పట్టాలు ఎక్కనుంది. స్పిరిట్ మూవీ ఈ ఏడాది చివరిలో షూటింగ్ వెళ్లనుంది. అది షూటింగ్ పూర్తి చేసుకొని అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అవ్వాలంటే.. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ పడుతుంది. ఈలోపు అల్లు అర్జున్ ఒక సినిమాని పూర్తి చేయొచ్చు.

ట్రెండింగ్ వార్తలు