Allu Arjun : తగ్గేదేలే అంటున్న పుష్ప.. ఇంటర్నేషనల్ మీడియాతో అల్లు అర్జున్..
తగ్గేదేలే అంటున్న పుష్ప. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో వరల్డ్స్ టాప్ లీడింగ్ మీడియాతో అల్లు అర్జున్.
- gum 95921
- Updated on- February 17, 2024 / 08:17 PM IST
Pushpa 2 star Allu Arjun interacted with world top media at Berlin International Film Festival
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో తన స్టార్‌డమ్ ని ఇంటర్నేషనల్ స్థాయికి విస్తరించారు. ఒక రీజినల్ సినిమాతోనే నేషనల్ అవార్డుని తెలుగు సినిమాకి తీసుకు రావడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటడం అల్లు అర్జున్‌కే సాధ్యమైంది. ప్రస్తుతం బన్నీ.. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. ఇండియన్ సినిమా తరపున నుంచి బన్నీ ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
ఇక ఈ ఫెస్టివల్ లో పుష్ప సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. దీంతో ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సందడి జోరుగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ తో కలిసి హాలీవుడ్ స్టార్స్ కూడా తగ్గేదేలే మ్యానరిజమ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక బన్నీ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ.. పుష్ప సినిమాకి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే పుష్ప 3 కూడా ఉండొచ్చు అంటూ హింట్ ఇస్తూ కామెంట్స్ చేశారు.
Also read : Anupama Parameswaran : టిల్లుగాడు మొత్తం మార్చేశాడంటూ.. బాధ పడుతున్న అనుపమ ఫ్యాన్స్..
తాజాగా అల్లు అర్జున్ వరల్డ్స్ టాప్ లీడింగ్ మీడియా ‘బిబిసి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. ఆ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో తెగ సందడి చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.
ఇక టాలీవుడ్ స్టార్స్ అంతా.. ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటుతుండడంతో టాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఈ ఫిలిం ఫెస్టివల్ పుష్ప చేసిన సందడితో.. సెకండ్ పార్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి క్యూరియాసిటీనే క్రియేట్ అవుతుంది. మరి సెకండ్ పార్ట్ తో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.
