×
Ad

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

డిసెంబర్ 17న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ Pushpa The Rise ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

  • Published On : November 14, 2021 / 10:54 AM IST

Pushpa

Pushpa The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’ (ది రైజ్ – పార్ట్ -1).. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.

Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పుష్ప రాజ్ ఇంట్రో వీడియో, క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, మూడు పాటలు ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆదివారం ఫోర్త్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే పాటను నవంబర్ 19న విడుదల చెయ్యబోతున్నారు. సరికొత్త గెటప్‌లో అల్లు అర్జున్ లుక్ ఆకట్టుకుంటోంది.

 

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బన్నీ – సుక్కు – దేవిల కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు ప్రూవ్ చేశాయి. వాటిని మించి ‘పుష్ప’ ఉండబోతోంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా జరుగుతోంది. డిసెంబర్ 17న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ Pushpa The Rise ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..