Raghava Lawrence : కంగనా సెక్యూరిటీపై లారెన్స్ కౌంటర్లు.. పాకిస్థాన్ బోర్డర్ లో ఉన్నామా అంటూ..

కంగనాకు ప్రభుత్వం గతంలో సెక్యూరిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగనా ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. షూటింగ్ కి వెళ్లినా కూడా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. అయితే తాజాగా జరిగిన చంద్రముఖి 2 సినిమా ప్రెస్ మీట్ లో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ కంగనా సెక్యూరిటీ మీద కౌంటర్లు వేశారు.

Raghava Lawrence sensational comments on Kangana Ranaut Security

Raghava Lawrence :  రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) కలిసి ఇప్పుడు చంద్రముఖి 2(Chandramukhi 2) సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నిన్న హైదరాబాద్ లో చంద్రముఖి 2 ప్రెస్ మీట్ నిర్వహించారు.

కంగనాకు ప్రభుత్వం గతంలో సెక్యూరిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగనా ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. షూటింగ్ కి వెళ్లినా కూడా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. అయితే తాజాగా జరిగిన చంద్రముఖి 2 సినిమా ప్రెస్ మీట్ లో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ కంగనా సెక్యూరిటీ మీద కౌంటర్లు వేశారు.

Also Read : Priya Bhavani Shankar : అమ్మకు క్యాన్సర్.. బతికించుకుంటాను అంటూ స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్..

రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. షూటింగ్ మొదట్లో కంగనా మేడంని చూస్తే భయం వేసింది. ఆమెతో పాటు అయిదుగురు గన్ మెన్స్ ఉంటారు. మేడం నవ్వుతూనే వస్తారు. కానీ ఆమె పక్కన ఉన్నవాళ్లు కొద్దిగా కూడా నవ్వరు. మనం వెళ్లి మేడంతో మాట్లాడితే మేడం ఫేస్ కొంచెం సీరియస్ అయినా వాళ్ళు గన్ మన పక్కకు తిప్పేస్తారేమో అని భయం. జాగ్రత్త్తగా మాట్లాడేవాడిని మొదట్లో. ఒకసారి ధైర్యం చేసి మేడంని అడిగాను. మేడం నేను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నానా, పాకిస్థాన్ బోర్డర్ లో షూట్ చేస్తున్నానా డౌట్ అని చెప్పాను. ఎందుకు అని అడిగితే ఎప్పుడు చూడు మీ వెనకాల ఈ గన్ మెన్స్ ఉంటారు. వాళ్ళని బయటకి పంపిస్తే కొంచెం ఫ్రీగా పనిచేసుకుంటాము అని చెప్తే మేడం ఒప్పుకొని వాళ్ళని బయటకి పంపించారు. అప్పట్నుంచి రోజు మేడం బాగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మొదట కంగనా మేడం అన్నాను, తర్వాత కంగనా అన్నాను. సినిమా అయ్యేసరినికి కంగు అని పిలిచాను. అంత క్లోజ్ అయ్యారు కంగనా గారు. బాంబేలో షూట్ చేసినప్పుడు మేడం ఇంటి నుంచే డైలీ భోజనాలు తెప్పించారు. తర్వాత అనవసరంగా మాట్లాడి వాళ్ళ గన్ మెన్స్ ని బయటకి పంపించేసానేమో అని ఫీల్ అయ్యాను అని అన్నారు. దీంతో రాఘవ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు