Rahul Sankrityan : సీడెడ్, నైజాం పదాలు వాడొద్దు.. బానిసత్వాన్ని గుర్తు చేస్తాయి.. రణబాలి డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
తాజాగా రణబాలి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ పదాలపై మాట్లాడాడు. (Rahul Sankrityan)
- Saketh U
- Updated on- October 24, 2026 / 12:31 PM IST
Rahul Sankrityan
Rahul Sankrityan : సినిమా బిజినెస్ లో తెలంగాణను నైజాం అని, రాయలసీమను సీడెడ్ అని పిలుస్తారని తెలిసిందే. మరి కొన్ని చోట్ల కూడా ఈ పదాలను వాడతారు. నిజాం పరిపాలన కారణంగా నైజాం అని, బ్రిటిష్ కాలంలో దత్త మండలాలుగా రాయలసీమను సీడెడ్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి అవే పేర్లను పలు చోట్ల వాడుతున్నారు.
తాజాగా రణబాలి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ పదాలపై మాట్లాడాడు. విజయ్ దేవరకొండ హీరోగా రాయలసీమలో బ్రిటిష్ కాలంలో వచ్చిన కరువు, బ్రిటిష్ వాళ్ళు చేసిన అకృత్యాలపై రణబాలి సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రణబాలి సినిమా సక్సెస్ మీట్ అనంతపురంలో నిర్వహించారు.
Also Read : Ram Charan : RC17లో దురంధర్ బ్యూటీ కాదా? బాలీవుడ్ ని ఒక్క సినిమాతోనే షేక్ చేసిన హీరోయిన్ ని ఫైనల్ చేసారా?
ఈ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు, మీడియా వాళ్లకు ఒక రిక్వెస్ట్. మనం ఇప్పటికీ ట్రేడ్ లో సీడెడ్, నైజాం అని పిలుస్తాం. దయచేసి ఆ పదాలు వాడొద్దు. మనకు ఉన్న అందమైన తెలుగు పదాలు రాయలసీమ, తెలంగాణ పదాలు వాడదాం. సీడెడ్, నిజాం.. అనేవి కోలోనియల్ సమయంలో, బూర్జువా వ్యవస్థలో నుంచి వచ్చిన మాటలు. బానిసత్వాన్ని గుర్తు చేసే మాటలు. అవి ఇప్పుడు వాడనవసరం లేదు. మనకు ఎంతో మంది గొప్పవాళ్ళు గొప్ప తెలుగు పేర్లు పెట్టారు. ఇకపై అయినా ట్రేడ్ వర్గాల్లో సీడెడ్, నైజాం పదాలు వాడగలిగితే ఆనందిస్తాను అని తెలిపారు. మరి రణబాలి దర్శకుడు చెప్పిన మాటలను ఎంతమంది పాటిస్తారో చూడాలి.
