Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ అసలు పేరేంటో తెలుసా? మరి పేరు ఎవరు మార్చారు?
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ తన అసలు పేరు చెప్పాడు. అలాగే తనకు ఈ పేరు ఎవరు పెట్టారో కూడా చెప్పాడు.
- Saketh U
- Published On : April 2, 2024 / 09:44 AM IST
RahuLSipligunj Revealed his own name and who changed it
Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్స్ లో ఒకరు. ఒక డిఫరెంట్ స్టైల్ తో లోకల్, నాటు వాయిస్ లతో కొత్తగా సాంగ్స్ పాడాలంటే రాహుల్ సిప్లిగంజ్ గుర్తుకొస్తాడు అందరికి. ఇక నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి మరింత ఎత్తుకు ఎదిగాడు. ఒక బార్బర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బార్బర్ గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు స్టార్ సింగర్ గా ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమా సాంగ్స్ ఆఫర్స్ తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు.
Also Read : RGV : ఆర్జీవితో ఆ ఇద్దరు భామలు.. తెగ వైరల్ అయిపోతున్న సుప్రీత, రీతూ చౌదరి..
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ తన అసలు పేరు చెప్పాడు. అలాగే తనకు ఈ పేరు ఎవరు పెట్టారో కూడా చెప్పాడు. రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టార్టింగ్ లో ఓ రెండు సినిమాల్లో కోరస్ పాడి ఆ క్యాసెట్స్ ని కీరవాణి దగ్గర ఉండే ఓ వ్యక్తికి ఇస్తే అవి విని కీరవాణి పిలిచి తన కోరస్ టీంలో ఛాన్స్ ఇచ్చారు. అప్పట్నుంచి ఇప్పటికి కూడా కీరవాణి సర్ పిలిస్తే వెళతాను. అయన వల్లే నా లైఫ్ మారింది. నా ఫస్ట్ రెండు సినిమాల్లో నా పేరు ‘విఠల్ రాహుల్’ అనే పడింది. నా పేరు అదే. ఓ రోజు కీరవాణి సర్ నా పేరు మార్చుకొమ్మని చెప్పి సిప్లిగంజ్ అని యాడ్ చేసుకోమన్నారు. అప్పట్నుంచి రాహుల్ సిప్లిగంజ్ అని పేరు మార్చుకున్నాను అని తెలిపారు. ఆ పేరు వల్ల నాకు మరింత గుర్తింపు వచ్చిందని తెలిపాడు రాహుల్.
