Raj Tarun – lavanya : నేడు మీడియా ముందుకు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రి.. లావణ్య వివాదం గురించి మాట్లాడతారా?

రాజ్ తరుణ్ బయటికి వస్తే బోలెడన్ని ప్రశ్నలు అడగడానికి మీడియా రెడీగా ఉంది.

Raj Tarun – lavanya : నేడు మీడియా ముందుకు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రి.. లావణ్య వివాదం గురించి మాట్లాడతారా?

Raj Tarun Malvi Malhotra Coming in front of Media after Lavanya Issue

Raj Tarun – lavanya : గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు.

అయితే దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి.. ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టి అనంతరం కనిపించకుండా మాయమయింది. మాల్వి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా రాజా తరుణ్ ఫోన్ నంబర్ కూడా మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. రాజ్ తరుణ్ బయటికి వస్తే బోలెడన్ని ప్రశ్నలు అడగడానికి మీడియా రెడీగా ఉంది. ఇందుకోసమే రాజ్ తరుణ్ బయటకి రావట్లేదని సమాచారం.

Also Read : Devara – Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ కోసం ఎంత ఫుడ్ తెప్పించారో చూడండి.. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా?

అయితే ఇటీవల జులై 26న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా ఇప్పటివరకు రాజ్ తరుణ్ రాలేదు. కానీ నేడు మధ్యాహ్నం తిరగబడరా సామి సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రి కూడా వస్తారని సమాచారం వచ్చింది. నిర్మాత కూడా హీరో హీరోయిన్స్ వస్తారు, మీడియాతో మాట్లాడతారు అని చెప్పారు.

దీంతో రాజ్ తరుణ్ వస్తాడా? రాజ్ తరుణ్ వచ్చినా లావణ్య వివాదం గురించి మాట్లాడతాడా? లేక కేవలం సినిమా గురించి మాట్లాడతాడా అని అంతా భావిస్తున్నారు. అయితే మీడియాతో ప్రెస్ మీట్ కూడా ఉందని ఆల్రెడీ సినీ మీడియాకు సమాచారం వచ్చింది. మరి మీడియా అడిగే ప్రశ్నలకు లావణ్య విషయంలో రాజ్ తరుణ్ మాట్లాడతాడా? లేదా కేవలం సినిమా గురించే అడగమని తప్పించుకుంటాడా చూడాలి.

Raj Tarun Malvi Malhotra Coming in front of Media after Lavanya Issue