Raj Tarun : స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో.. టార్టాయిస్..
గత రెండు రోజులుగా స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో.. అంటూ సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రమోషన్ తో వైరల్ చేసారు. (Raj Tarun)
- Saketh U
- Published on- August 30, 2026 / 02:49 PM IST
Raj Tarun
Raj Tarun : గత రెండు రోజులుగా స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో.. అంటూ సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రమోషన్ తో వైరల్ చేసారు. దీంతో అదేం సినిమా, ఆ హీరో ఎవరు అని ఆసక్తిగా మారింది. తాజాగా దీనికి సంబంధించిన సినిమా ప్రకటన వచ్చింది.
స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘టార్టాయిస్’. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాణంలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో టార్టాయిస్ సినిమా తెరకెక్కుతుంది.
Also See : Samantha : బేబీ బంప్‌తో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసిన సమంత..
సస్పెన్స్, డ్రామా, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో టార్టాయిస్ తెరకెక్కుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా ఇంటెన్స్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నట్టు సమాచారం. హీరో నిద్రలో నడిచి ఉండే అలవాటు ఉంటుందని, ఆ అలవాటుతో అనుకోకుండా కొని సంఘటనల్లో ఎంటర్ అయితే ఏం జరిగింది అనే కథాంశంతో ఉండబోతుంది టార్టాయిస్.
