Raj Tarun Tortoise : మాస్ అవతారంలోకి మారిన రాజ్ తరుణ్.. టార్టాయిస్ అంటూ..

Raj Tarun Tortoise Look: హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. (Raj Tarun)

  • Updated on- May 12, 2026 / 04:48 PM IST

Raj Tarun Tortoise First Look

Raj Tarun Tortoise : రాజ్ తరుణ్, అమృత చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా టార్టాయిస్. SK గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, NVL క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మాణంలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. మా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. టార్టాయిస్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. రాజ్ తరుణ్ 25వ సినిమాగా ఇది రాబోతుంది. కొత్త స్క్రీన్ ప్లేతో థ్రిల్లర్ సినిమా ఇది. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి కొన్ని మర్డర్స్ చేస్తాడు.తర్వాత ఏమి జరుగుతుంది అనే కథతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు.

Also See : Suriya : వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్.. కత్తి పట్టిన సూర్య.. ఒకే వేదికపై అన్నదమ్ములు..